Chiranjeevi: ఇప్పటికీ షాంపూ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటా..

|

Apr 01, 2024 | 2:55 PM

అభిమానులతో పాటు కోట్ల ఆస్తిని సైతం సొంతం చేసుకున్నారు. అయితే చిరు జీవితం పుట్టగానే ఏం గోల్డ్ స్పూన్‌ కాదు. ఇప్పుడైతే వందల కోట్లకు అధిపతి కానీ సినిమాలకు రాకముందు చిరు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు చిరు...

Chiranjeevi: ఇప్పటికీ షాంపూ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటా..
Chiranjeevi
Follow us on

చిరంజీవి ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమాటకొస్తే యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్డ్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హీరో అంటే చిరంజీవి అనేంతలా ముద్ర వేశారు. తన అసమాన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరు.

ఇక అభిమానులతో పాటు కోట్లాది ఆస్తిని సైతం సొంతం చేసుకున్నారు. అయితే చిరు జీవితం పుట్టగానే ఏం గోల్డ్ స్పూన్‌ కాదు. ఇప్పుడైతే వందల కోట్లకు అధిపతి కానీ సినిమాలకు రాకముందు చిరు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు చిరు. చిరంజీవి పేరు వినగానే లగ్జరీ ఇల్లు, కోట్లు విలువ చేసే కార్లు గుర్తొస్తాయి. కానీ చిరు చెప్పిన ఓ విషయం వింటే అతను ఇప్పటికీ ఇంత సింప్లిసిటీగా ఉంటున్నాడా అర్థమవుతోంది.

తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరుతో పాటు హీరో విజయ్‌ దేవరకొండు కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా విజయ్‌ దేవరకొండ.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చిరు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు ఓ ఆసక్తికర విషయమైన పంచుకున్నారు. ఇప్పటికీ తాను పొదుపు పాటిస్తానని తెలిపారు. ఇంట్లో వాళ్లంతా లైట్స్‌ ఆన్‌ చేసి వెళ్లిపోతుంటారని తానే వాటన్నింటినీ దగ్గరుండి ఆఫ్‌ చేస్తుంటానని తెలిపారు.

ఇక రామ్‌ చరణ్‌ బ్యాంకాక్‌ వెళ్లే సమయంలో తన గదిలోని లైట్స్‌ను అలాగే వదిలేసి వెల్లాడని, తానే వాటన్నింటినీ ఆఫ్‌ చేశానని తెలిపారు. మధ్య తరగతి మెంటాలిటీ అంటే ఇదేన్న చిరు.. ఇప్పటికీ తాను షాంపూ అయిపోతే ఆ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటానని తెలిపారు. అంతేకాదు సబ్బు చివరకు వచ్చాక, చిన్న చిన్న ముక్కలన్నింటినీ వాడుతుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. కోట్లకు అధిపతి అయిన చిరు చెప్పిన ఈ మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..