Virata Parvam Movie : యదార్ధ సంఘటనల ఆధారంగా విరాటపర్వం… ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్

|

Mar 18, 2021 | 7:15 PM

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం వేణు అడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా  ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది.

Virata Parvam Movie : యదార్ధ సంఘటనల ఆధారంగా విరాటపర్వం... ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
Rana
Follow us on

Virata Parvam Movie : దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా  ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన కోలో కోలోయమ్మ అనే పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.ఈక్రమంలో తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. చిరంజీవి విరాట పర్వం టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే   విరాటపర్వంలో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక టీజర్ విషయానికొస్తే..  ఈ సినిమాలో రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నారు. అభ్యుదయ భావాలూ కలిగిన యువకుడిగా రానా అద్బుతంగా నటించాడు. అతడి కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది. సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయనిపిస్తుంది. మొత్తంగా టీజర్ సినిమా అంచనాలను, ఆసక్తిని పెంచేసింది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.