Actor Bharath : తల్లి కోరిక కోసం నటనకు గుడ్ బై.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్..

నటనకు దూరం అవుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశారన్న వార్త వైరల్ కావడంతో సినిమాలకు గుడ్‌బై చెప్పారన్న ప్రచారం పెరిగింది. దీనిపై స్పందించిన భరత్ నటనను వదిలేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం భరత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Actor Bharath : తల్లి కోరిక కోసం నటనకు గుడ్ బై.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్..
Bharath

Updated on: Nov 14, 2026 | 2:01 PM

చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 80కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మాస్టర్ భరత్, తాజాగా తాను నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనటుడిగా అడుగుపెట్టి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు మాస్టర్ భరత్. చైల్డ్ ఆర్టిస్టుగా చిత్రాల్లో తన అద్భుతమైన హావభావాలు, కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. చిన్నతనంలోనే బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి దిగ్గజ నటులతో పాటు ఎందరో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని భరత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘రెడీ’, ‘ఢీ’, ‘వెంకీ’ చిత్రాల్లో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అయితే, గత కొద్ది రోజులుగా మాస్టర్ భరత్ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతున్నారని, నటనకు గుడ్‌బై చెప్పి డాక్టర్ అయ్యేందుకు అడుగులు వేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించిన భరత్, తాను నటనకు గుడ్‌బై చెబుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, మంచి కథలు, తనకు నప్పే వైవిధ్యమైన పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని ఆయన స్పష్టం చేశారు. సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని భరత్ క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల భరత్ ఎంబీబీఎస్ పూర్తి చేశారని, తల్లి చివరి కోరికను తీర్చారని కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆయన చదువుపై దృష్టి పెట్టారని, చెన్నైలో వైద్య విద్య పూర్తి చేశారని రూమర్స్ వినిపించాయి. భరత్ చిన్న వయసులోనే నటనలోకి వచ్చారు. 2019లో వచ్చిన ‘ఏబీసీడీ’లో ఆయన రెండో హీరోగా కనిపించారు. భరత్ తల్లి కమలహాసిని 2025 మే 18న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. ఆమెకు భరత్ ఒక్కడే సంతానం. తల్లి ప్రోత్సాహంతోనే ఆయన చిన్నతనంలో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె మరణం తర్వాత భరత్ సినిమాలకు మరింత దూరంగా ఉంటున్నారని రూమర్స్ వచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us