బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నాడు హీరో మంచు మనోజ్. బాలుడికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చి మానవత్వాన్ని నిలబెట్టాడు. వివరాల్లోకి వెళితే..
ఓ బాబు బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని, అతడికి చికిత్స చేయించే స్థితిలో కుటుంబం లేదన్న వీడియోను ఓ నెటిజన్ చూసి దానని నందమూరి ఫ్యాన్స్‌కు, సోనుసూద్‌కు ఫార్వర్డ్ చేశాడు. అందులో మనోహర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను ఆటోడ్రైవర్ అని, తన బిడ్డకు చికిత్స చేయించేందుకు డబ్బులు లేవని ఏడుస్తూ దాతలను కోరాడు. ఆ వీడియోను చూసిన మంచు మనోజ్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తనకు పేషేంట్ పేరు, ఆస్పత్రి పేరు, వైద్యుల పేర్లు, ఇతర వివరాలు పంపంచాలని కోరాడు. అంతేకాకుండా ధైర్యంగా ఉండడని, ఆ బాలుడు త్వరగా కోలుకుంటాడని రీ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు హీరో మంచు మనోజ్‌ను మరో సోనుసూద్ అంటూ పొగడుతున్నారు. హ్యాట్సాఫ్ అంటూ అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. లాక్‌డౌన్‌లో కూడా మనోజ్ వలస కార్మికులకు సాయం చేశాడు. సొంత డబ్బులతో కార్మికులను ఊళ్లకు పంపించాడు.