మంచు వారమ్మాయి దాతృత్వం.. వారికోసం వంద కిలోమీటర్లు సైకిల్ పై పయనం.. వీడియో వైరల్..

|

Feb 08, 2021 | 1:57 PM

టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఈసారి స్పోర్ట్స్‏లో రాణించాలని ఉన్న పేద

మంచు వారమ్మాయి దాతృత్వం.. వారికోసం వంద కిలోమీటర్లు సైకిల్ పై పయనం.. వీడియో వైరల్..
Follow us on

Manchu Lakshmi: టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఈసారి స్పోర్ట్స్‏లో రాణించాలని ఉన్న పేద దివ్యాంగులకు అండగా నిలబడింది మంచు వారమ్మాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న పేద దివ్యాంగులకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ అనే సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా వారికి నిధులు సేకరించి ఇవ్వాలని మంచు లక్ష్మీ సైకిల్ పై వంద కిలోమీటర్లు పయనించి దాదాపు రూ.5 లక్షల రూపాయాలను ఫౌండేషన్‏కు ఇవ్వాలనుకుంటుంది లక్ష్మీ. ఇలా మొదలు పెట్టిన ప్రయాణంతో ఇప్పటి దాదాపు రూ.73 వేల నిధులను సమకూర్చింది.

ఈ సంస్థకు నిధుల సమకుర్చేందుకు గత ఆరు సంవత్సరాలుగా మంచి లక్ష్మీ సహయం చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గోనాలని తెలిపింది లక్ష్మీ. మొదట ఆదిత్యా మెహతా ఫౌండేషన్ కోసం 35 కిలోమీటర్లు సైకిల్ తొక్కినప్పుడు స్వచ్ఛమైన గాలి, వాసన, శబ్ధం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి అంటూ తన ట్విట్టర్లో పేర్కోంది. ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ అండ్ రెహెబ్ సెంటర్లో శిక్షణ పొందనున్న పారా అథ్లెట్ల కోసం వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాను. మీరు కూడా ముందుకు వచ్చి మీకు తోచిన సహయం చేయాలని మంచు లక్ష్మీ కోరింది. మంచు లక్ష్మి మొదలు పెట్టిన ఈ వంద కిలోమీటర్ల సైక్లింగ్ ఈ నెల 28తో ముగియనుంది.

Also Read:

Actress Anushka Sharma: తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. ఆశ్చర్యంలో అభిమానులు..