Saniya Iyappan-Grace Antony: హీరోయిన్లకు చేదు అనుభవం.. ఒంటిపై చేయి వేసిన వ్యక్తి చెంప పగలగొట్టిన నటి..

మూవీలోని ఇద్దరు హీరోయిన్స్ సానియా, గ్రేస్ ఆంటోనిలు విచ్చేశారు. దీంతో వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

Saniya Iyappan-Grace Antony: హీరోయిన్లకు చేదు అనుభవం.. ఒంటిపై చేయి వేసిన వ్యక్తి చెంప పగలగొట్టిన నటి..
Saniya Iyappan,grace Antony

Updated on: Sep 28, 2022 | 3:56 PM

సాధారణంగా చిత్రపరిశ్రమలోని హీరోహీరోయిన్లకు పలు చోట్లు అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సినిమా ప్రమోషన్స్. మాల్ ఓపెనింగ్స్‏కు వెళ్లినప్పుడు ఫ్యాన్స్ చేసే వెకిలి చేష్టలు.. సెల్ఫీ అంటూ దగ్గరకు తొసుకుని వస్తుంటారు. ఇక అలాంటి ఘటనే మరో ఇద్దరు హీరోయిన్స్ విషయంలోనూ జరిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షాపింక్ మాల్‏కు వెళ్లిన హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురైంది. అత్యుత్సాహంతో ఓ వ్యక్తి హీరోయిన్ ఒంటిపై చేయి వేయడంతో అతడిని లాగిపెట్టి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమకు ఎదురైన అనుభవం గురించి మరో హీరోయిన్ నెట్టింట పోస్ట్ చేసింది. సాటర్డే నైట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కాలికట్ (కోజికోడ్)లో హైలైట్‏ మాల్‏లో ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడికి చిత్రయూనిట్ తోపాటు..మూవీలోని ఇద్దరు హీరోయిన్స్ సానియా , గ్రేస్ ఆంటోనిలు విచ్చేశారు. దీంతో వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

కార్యక్రమం అనంతరం వారిద్దరు బటకు వస్తున్న క్రమంలో అభిమానులంత అత్యుత్సాహంతో వారి వెంట కదిలారు. ఈ క్రమంలోనే అందులో కొందరు వారిద్దరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా అందులో ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ గ్రేస్ ఒంటిపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన సాయిన అయ్యప్పన్ అతడి చెంప పగలగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇదే సంఘటనను సానియా సోషలా మీడియాలో చెప్పుకొచ్చింది.

“నేను, మా సినిమా యూనిట్ మొత్తం ‘సాటర్డే నైట్’ని కాలికట్‌లోని ఒక మాల్‌లో ప్రమోట్ చేస్తున్నాము. అన్ని చోట్లా ప్రమోషన్ ఈవెంట్‌లు బాగా జరిగాయి. కాలికట్ ప్రజలు చూపించిన ప్రేమకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేడుకకు చాలా మంది అభిమానులు వచ్చాయి. మాల్ మొత్తం జనంతో నిండిపోయింది. వారిని అదుపు చేసేందుకు సెక్యూరిటీ సైతం చాలా కష్టపడ్డారు. ఇక ఈవెంట్ ముగిసిన తర్వాత నేను, నా సహనటి బయటకు వస్తున్నప్పుడు కొంతమంది నా స్నేహితురాలు గ్రేస్‏తో అనుచితంగా ప్రవర్తించారు.

ఎక్కువ మంది ఉండడంతో అతడిని గుర్తించలేకపోయాము .. ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాము. ఆ తర్వాత నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ వీడియో చూసి నేను షాక్ అయ్యాను. ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయి ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. మహిళలపై హింస, అసభ్యంగా ప్రవర్తించేవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలి ” అంటూ ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.