మహేష్ తదుపరి చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలు ఆయన అభిమానులను కంగారు పెడుతున్నాయి. అసలు మహేష్ విషయంలో ఏం జరుగుతోంది..? ఈ రూమర్లపై మహేష్ టీమ్ గానీ, వంశీ టీమ్‌గానీ ఎందుకు స్పందించలేదు..? మహర్షి కాంబోలో రావాల్సిన మరో ప్రాజెక్ట్ ఆగిపోవడానికి గల అసలు కారణాలేంటి..? మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందన్న ఈ మూవీకి బ్రేక్ ఏంటి..? తన క్లోజ్ ఫ్రెండ్‌కు, మహేష్‌కు మధ్య ఏం జరిగింది..? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ మెదలుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రూమర్లపై ఇంకా స్పష్టత రాకముందే వంశీ పైడిపల్లి గురించిన మరోవార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే మహేష్‌తో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. వంశీ పైడిపల్లి మిగిలిన హీరోలను కలుస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కలిసిన వంశీ ఇప్పటికే కథను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పనట్లు సమాచారం. మరి వంశీకి ప్రభాస్‌కు ఓకే చెప్తారో..? లేదో..? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. కాగా ప్రభాస్ నటించిన మున్నా చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తుండగా.. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ మూవీని.. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
Read This Story Also: మహేష్ మూవీ ఆగిపోవడానికి నాగ్ డైరక్టర్ కారణమా..!