
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఏప్రిల్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా మే 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 6న విడుదల చేస్తారని సమాచారం. ఇంకా దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి, దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.