ఇప్పటి వరకు ఎన్నో పాత్రలతో అభిమానులను అలరించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తాజాగా ఓ మాస్ క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరైనోడు ఇలా వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న మహేశ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్.
సర్కార్ వారి పాట సినిమా తర్వాత మహేశ్ టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌలి డైరెక్షన్‌లో ఓ సినిమా కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా కొద్దిగా లేటవుతుందన్న కారణంతో ఈ మధ్య గ్యాప్‌లో వంశీ సినిమాలో నటిస్తారని చెప్పారట. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా కరారు చేశారు. మెగాస్టా్ర్ చిరంజీవి నటించిన అలనాటి బ్లాక్‌బస్టర్ సినిమా స్టేట్‌రౌడీ టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్ పక్కా మాస్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. మరి స్టేట్‌రౌడీ యాక్షన్ ఎప్పడు మొదలుపెడుతాడో అని ఇప్పటి నుంచే అభిమానులు ఆరాటపడుతున్నారు.