AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కు మహేష్ బాబు ఫిదా.. 27 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతోన్న వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలన్నీ నెట్టింట షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చిన్నారి చేసిన రీల్ కు మహేష్ బాబు ముగ్దుడైపోయారు.

Mahesh Babu: చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కు మహేష్ బాబు ఫిదా.. 27 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతోన్న వీడియో
Mahesh Babu
Basha Shek
|

Updated on: Nov 25, 2026 | 9:42 AM

Share

ఓ చిన్నారి క్యూట్ నెట్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా అయిపోయారు. పోకిరి, గుంటూరు కారం సినిమాల్లోని పాటలు పాడుతూ ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు ముగ్దుడైపోయారు. అమ్మాయి క్యూట్‌ నెస్ కు తోడు మహేష్ బాబు కామెంట్స్ తో ఇప్పుడు ఆ చిన్నారి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఏకంగా 27 మిలియన్ల వ్యూస్ తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘bysweetlycurious’ అనే ఓ ఇన్ స్టా గ్రామ్ రీల్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అందులో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి క్యూట్ గా పాటలు పాడుతూ కనిపించింది. మొదట పోకిరి సినిమాలోని ‘నొప్పి నొప్పి గుండెంత నొప్పి’ పాటను పాడిన చిన్నారి ఆ తర్వాత తల్లితో కలిసి గుంటూరు కారం సినిమాలోని ధూమ్ మసాలా పాటను పాడింది. ఇందులో చిన్నారి స్వీట్ వాయిస్ తో పాటు ఆ పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిన్నారి వీడియోను చూసి ఫిదా అయిపోయారు. వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ‘హా హా.. సో క్యూట్.. లాట్స్ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్’ అని కామెంట్ చేశారు. అంతే ఆ రీల్ ఏకంగా 27 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోయింది. అంతే కాదు ఆ అకౌంట్ ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగిపోయారు. ఈ రీల్ కు ముందు 35K ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఏకంగా 151 K కి చేరారు. మొత్తానికి మహేష్ బాబు కామెంట్ తో ఈ చిన్నారి వీడియో ఇప్పడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. యాక్షన్ అడ్వెంచర్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా వారణాసి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు మెచ్చిన ఇన్ స్టా గ్రామ్ రీల్..

View this post on Instagram

A post shared by Jaya🌛 (@bysweetlycurious)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కు మహేష్ ఫిదా.. ఏకంగా 27 మిలియన్ల వ్యూస్‌
చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కు మహేష్ ఫిదా.. ఏకంగా 27 మిలియన్ల వ్యూస్‌
సిరాజ్ ఆడితే మ్యాచ్ గెలిచేవారా? వివాదంపై బీసీసీఐ మొట్టికాయలు
సిరాజ్ ఆడితే మ్యాచ్ గెలిచేవారా? వివాదంపై బీసీసీఐ మొట్టికాయలు
కార్తీక పౌర్ణమి దీపం మిస్ అయ్యారా? ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం
కార్తీక పౌర్ణమి దీపం మిస్ అయ్యారా? ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం
డ్రగ్స్‌పై పోరుకు కిషన్ రెడ్డి పాదయాత్ర.. లైవ్ వీడియో
డ్రగ్స్‌పై పోరుకు కిషన్ రెడ్డి పాదయాత్ర.. లైవ్ వీడియో
చలికాలంలో ఇంట్లోనే ఉంటూ.. ఫిట్‌గా ఉండేందుకు ఈజీ వ్యాయామాలు ఇవే!
చలికాలంలో ఇంట్లోనే ఉంటూ.. ఫిట్‌గా ఉండేందుకు ఈజీ వ్యాయామాలు ఇవే!
సామాన్యుల జేబుకు చిల్లు.. ఒకేసారి పెరిగిన ఫోన్లు, టీవీలు ధరలు
సామాన్యుల జేబుకు చిల్లు.. ఒకేసారి పెరిగిన ఫోన్లు, టీవీలు ధరలు
OTTలోకి వచ్చేస్తున్న వెంకటేశ్ ఆదర్శ కుటుంబం..
OTTలోకి వచ్చేస్తున్న వెంకటేశ్ ఆదర్శ కుటుంబం..
సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?
సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?
మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం
మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం
విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!
విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!