
ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫోక్ ప్రపంచంలో అత్యంత క్రేజీ ఫాలోయింగ్ ఉన్న మాధురి రాథోడ్, ఈశ్వర సాయి జంటగా నటించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పక్కా ఊరమాస్ బీట్స్‌తో రూపొందిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను, ముఖ్యంగా జానపద ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఈ సాంగ్ పేరు తంగేడు చెట్ల కింద. ఈ పాట ప్రారంభం నుంచే శ్రోతలను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసే ఊపుతో సాగుతుంది. తెలంగాణ అచ్చమైన యాస, జానపద వాతావరణం ఉట్టిపడేలా సాగే ఈ పాటలో మాధురి, ఈశ్వర సాయి స్టెప్స్ మరింత హైలెట్ అయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
ఇక ఈ పాట ఇప్పుడు డీజేలలో మోగిపోతుంది. పెళ్లిళ్లు, గ్రామాల్లో జరిగే పండగలు, డీజే పార్టీల్లో ఈ పాట ఇప్పుడు మస్ట్ సెలెక్షన్‌గా మారిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. గడ్డం సంతోష్, ప్రభ కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు ఫోక్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తుంది. ఫోక్ పాటకు డీజే వైబ్ మిక్స్ చేసి రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. విడుదలైన తక్కువ సమయంలోనే వేల సంఖ్యలో లైక్‌లు సాధిస్తూ, యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ మాస్ సాంగ్ పల్లెటూరి మాధుర్యాన్ని మరోసారి నూతన హంగులతో ప్రేక్షకులకు పంచింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
మొత్తానికి చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సాంగ్ మరోసారి వీరి క్రేజ్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ పాట నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా ఇన్ స్టా, సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా తెగ పాపులర్ అవుతుంది. ఇంతకీ మీరు ఈ పాట విన్నారా.. ? అయితే వినేయండి.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..