Madhura Wines: ‘పెద్ద బీర్‌ కొంటే.. చిన్న బీర్‌ ఫ్రీ. ఫుల్‌కి.. ఆఫ్‌ ఉచితం’… మధుర వైన్స్‌ ట్రైలర్‌ చూశారా..?

Madhura Wines Trailer: ఎలాంటి లక్ష్యం లేకుండా, జాలీగా లైఫ్‌ ఎంజాయ్‌ చేసే హీరో. అనుకోకుండా అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. దీంతో హీరో జీవితం పూర్తిగా...

Madhura Wines: పెద్ద బీర్‌ కొంటే.. చిన్న బీర్‌ ఫ్రీ. ఫుల్‌కి.. ఆఫ్‌ ఉచితం... మధుర వైన్స్‌ ట్రైలర్‌ చూశారా..?

Updated on: Feb 05, 2021 | 5:38 AM

Madhura Wines Trailer: ఎలాంటి లక్ష్యం లేకుండా, జాలీగా లైఫ్‌ ఎంజాయ్‌ చేసే హీరో. అనుకోకుండా అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. దీంతో హీరో జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి కథాంశంతో టాలీవుడ్‌ ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా అలాంటి కథాంశంతో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘మధుర వైన్స్‌’.
యువతను ఆకట్టుకునే విధంగా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ను గమనిస్తే ఎలాంటి బాధ్యత లేకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మద్యం తాగుతూ ఎంజాయ్‌ చేసే హీరో జీవితంలోకి.. అసలు మందు అంటేనే అసహ్యంగా భావించే ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. అనంతరం ఆ హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది లాంటి ఆసక్తికర అంశాలతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆర్‌కే సినీ టాకీస్ బ్యానర్‌పై రాజేశ్‌ కొండెపు నిర్మిస్తున్న ‘మధుర వైన్స్‌’ సినిమాలో నవీన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్‌గా సీమా చౌదరి నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ కుర్రకారును బాగా ఆకట్టుకుంటోంది. ‘పెద్ద బీర్‌ కొంటే.. చిన్న బీర్‌ ఫ్రీ.. ఫుల్‌ కొంటే ఆఫ్‌ ఫ్రీ’లాంటి ఆఫర్లు ఇవ్వొచ్చు’ కదా అని హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాన్స్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..? సక్సెస్ మీట్… హీరోగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు..