MAA Election: ‘మా’ ఎన్నికల్లో మరో అలజడి.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి.. ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు!

|

Oct 06, 2021 | 4:47 PM

సిని‘మా’ ఎన్నికలు గతంలో కామ్‌గా జరిగేవి. కానీ ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ని ఎటాక్‌ చేసే దాకా వెళ్లాయి. ఇక లోకల్ నినాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. రెండు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు కాస్తా దూషణలపర్వం వరకు వెళ్లింది.

MAA Election: ‘మా’ ఎన్నికల్లో మరో అలజడి.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి.. ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు!
Hema Vs Karate Kalyani
Follow us on

MAA Election 2021: సిని‘మా’ ఎన్నికలు గతంలో కామ్‌గా జరిగేవి. కానీ ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ని ఎటాక్‌ చేసే దాకా వెళ్లాయి. ఇక లోకల్ నినాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. మరోవైపు ఫేసులు మార్ఫింగ్ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ నటి హేమ గగ్గోలు పెడుతూ.. ఏకంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.

నిన్నటి వరకు ఎన్నికల్లో గెలుపు, సభ్యుల సంక్షేమం, అజెండా. కాని ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ, ఫిర్యాదుల పర్వం. మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు కాస్తా దూషణలపర్వం వరకు వెళ్లింది.

ముఖ్యంగా హేమ వర్సెస్ కరాటే కల్యాణి. ఇదే ఇప్పుడు అసలు సిసలైన కాంట్రవర్సీ. నరేష్, కళ్యాణి అసత్య అరోపణలు చేస్తూ తన ప్రతిష్ట దిగజార్చుతున్నారనేది హేమ కంప్లైంట్ సారాంశం. దీనిపైనే ఆమె ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారామె. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని మండిపడుతున్నారు. వాట్సాప్ గ్రూప్ మధ్య జరిగిన సంభాషణే ఇందుకు కారణం. దాని వెనుక చాలా మతలబు ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఇంతకీ ఏం జరిగింది? వాట్సాప్ గ్రూప్ సంభాషణలో ఏం జరిగింది? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ హేమ గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ సమయంలో నరేశ్ ఎగతాళి చేసినట్లు కూడా ఆమె చెప్తున్నారు. అయితే కంప్లైంట్ చేసేందుకు వెళ్లినప్పుడు.. పోలీసులే కొన్ని ఫొటోలు డిలీట్ చేయాలని హేమకు చెప్పారంటూ కరాటే కళ్యాణే గుర్తు చేస్తున్నారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకొని గ్లాస్‌ పట్టుకొని ఉన్న ఫొటో డిలీట్ చేయించలేదా అంటూ కల్యాణి ప్రశ్నిస్తున్నారు.

మా ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేసిన హేమ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని కోరారు. మా ప్రతిష్ట దిగజార్చకుండా సభ్యులు ప్రవర్తించాలంటూ హేమ సూచించారు. నరేశ్, కల్యాణి ఈ విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలన్న హేమ.. ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ప్రవర్తన కల్గిన వారికి ఇదొక గుణపాఠం కావాలంటున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వీరి పర్సనల్ తగాదాలు రచ్చగా మారాయి.

Read Also… Monal Gajjar: స్టన్నింగ్ లుక్స్ తో.. అరుదైన అందంతో.. మతిపోగోతున్న గుజరాతి ముద్దుగుమ్మ ‘మోనాల్ గజ్జర్’ ఫొటోస్…