‘RRR’ మూవీ థియేట్రిక‌ల్ హక్కులను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Feb 17, 2021 | 7:20 PM

మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళీ ఈ సినిమాకు రూపొందిస్తున్నారు.

RRR మూవీ థియేట్రిక‌ల్ హక్కులను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Follow us on

మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళీ ఈ సినిమాకు రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల యాబై కోట్ల భారీ బడ్జెట్‏తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై ఈ మూవీ పోస్టర్స్ బిజినెస్ కూడా దూసుకుపోతుంది. అందుకు తగినట్లే ఈ మూవీ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నట్లుగా సమాచారం.

ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రిక‌ల్ తమిళ హ‌క్కుల‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. తమిళనాడులో రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉండడం వల్లే లైకా ప్రొడక్షన్స్ ఇంత పెద్ద మొత్తంతో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ సగం డబ్బును నిర్మాతలకు ఇచ్చేసిందని టాక్. ఇక ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో 2021 అక్టోబర్ 13లో విడుదల కానుంది. పాన్ ఇండియా క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్ర‌లో, అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టిస్తున్నారు.అజ‌య్ దేవ్‌గ‌న్, శ్రియ‌, స‌ముద్రఖ‌ని ఇత‌ర కీ రోల్స్ లో క‌నిపించ‌నున్నారు. గ‌తంలో బాహుబ‌లి 2 త‌మిళ రైట్స్ కు రూ.37 కోట్లు ప‌లికాయి. ‌దీంతో పోలిస్తే మార్కెట్‏లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఓ రేంజ్‌లో ఉంటుంద‌నిపిస్తోంది.

Also Read:

Uppena Movie : అద్భుత ప్రేమకావ్యంకోసం కదిలిన బావ రామ్ చరణ్.. ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..