ఇక సెలవు.. చెన్నైలో ముగిసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు

ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం చెన్నైలోని నేసపాకం శ్మశానవాటికలో ఆయన పార్ధీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు విరుగాంబాక్కంలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచిన కుటుంబ సభ్యులు.. సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

ఇక సెలవు.. చెన్నైలో ముగిసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు
Legendary Filmmaker's Funeral Concludes In Chennai

Updated on: Oct 04, 2026 | 8:45 PM

భారతీయ సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం కన్నుమూశారు. 94 ఏళ్ల సింగీతం.. వయోభారంతో అనారోగ్యానికి గురై శనివారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగీతం పార్థివదేహాన్ని చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ప్రజలు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం చెన్నై నెసపాక్కం శ్మశానవాటికలో సింగీతం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రలువురు సినీ ప్రముఖులు సింగీతం అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది నివాళులు అర్పించారు.

కాలంతో ప్రయాణం చేయడం ఎవరికైనా సహజం. కానీ, ఆ కాలాన్ని దాటి ఆలోచించడం.. అందుకు తగినట్టుగా వెండితెరపై ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఎల్లలు దాటిన తన ఆలోచనలతో దశాబ్దాల క్రితమే పాన్‌ ఇండియా సినిమాకు నిర్వచనం చెప్పిన సింగీతం శ్రీనివాసరావు.. ఇక సెలవంటూ అనంత లోకాలకు వెళ్లిపోయారు.

సింగీతం సినీ ప్రస్థానం

1931, సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన సింగీతం.. కెవి రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణం మొదలు పెట్టారు. 1972లో నీతి నిజాయితీతో సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ఇలా మొదలైన ఆయన ప్రయాణం 60కి పైగా విభిన్న సినిమాలకు దర్శకత్వం వహించే వరకు వెళ్లింది. కేవీరెడ్డి కాలంటో మొదలైన సినీ ప్రస్థానం మొదలెట్టిన సింగీతం శ్రీనివాసరావు. 94ఏళ్ల వయసులోనూ మెగాఫోన్‌ పట్టుకుని సినిమా పట్ల తన మక్కువ చాటిచెప్పారు. చివరిదాకా వినూత్న ఆలోచనలకే కేంద్రంగా బతికిన దర్శక దిగ్గజం.

యాభైఏళ్ల పైబడిన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోశారు సింగీతం. ఇటీవల క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో సింగ్‌ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మాటలు లేకుండా నాడు పుష్పక విమానం తీసి.. యావత్‌ దేశందృష్టిని తనవైపు తిప్పుకొన్న సింగీతం. జీవిత చరమాంకంలోనూ.. అలాంటి ఓ అద్భుతానికి ప్రాణం పోశారు. పాత్రదారులు కేవలం పాటల రూపంలో తమ హావభావాలు పంచుకునే విధంగా.. సింగ్‌గీతం అనే సృజనాత్మకమైన సినిమాను తెరకెక్కించింది విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. వయసు తన శరీరానికే కాని.. మనసుకు, మేథస్సుకు, అరుదైన ఆలోచనలకు కాదని నిరూపించారు.

సినీ అద్భుతంగా అభివర్ణించే మాయాబజార్‌ సినిమాతో అసోసియేట్‌గా తన ప్రస్థానం మొదలెట్టిన సింగీతం శ్రీనివాసరావు.చివరిశ్వాస వరకు తొలిసినిమానే అనుసరించారు. కొత్తగా ఆలోచించడమే తప్ప. మూస సినిమాలు చేయడానికి సింగీతం. తన ప్రతీ ప్రయత్నంలోనూ ఆవిషయాన్ని స్పష్టంగా చెప్పారు. విచిత్రసోదరులు, మైకేల్‌ మదనకామరాజు, పుష్పకవిమానం, మయూరి, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు.. ఆయన ఆలోచన అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందే చెబుతాయి. అంతెందుకు, నేటి జెన్‌జీ తరాన్ని మించి ఆయన ఐడియాస్‌ ఉంటాయంటే అతిశయోక్తికాదు. అందుకే, వందేళ్లకు చేరువలో ఉండి. పాటలతో హావబావాలు పంచుకునే పాత్రలతో సింగ్‌గీతం సినిమాను ఆవిష్కరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us