‘కన్నానులే’ పాటకు లావణ్య స్టెప్పులు.. అదరగొట్టిందిగా

మణిరత్నం తెరకెక్కించిన ఆణిముత్యాల్లో బొంబాయి సినిమా ఒకటి. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా హీరోహీరోయిన్లుగా నటించిన

కన్నానులే పాటకు లావణ్య స్టెప్పులు.. అదరగొట్టిందిగా

Updated on: Sep 01, 2020 | 7:23 PM

Lavanya Tripathi dance: మణిరత్నం తెరకెక్కించిన ఆణిముత్యాల్లో బొంబాయి సినిమా ఒకటి. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించి, క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలను, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ని అందించారు. ఈ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తి అయినా..  ఇప్పటికీ అందులోని పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ‘కన్నానులే’ అనే పాటకు స్టెప్పులు వేశారు బుగ్గసొట్టల బ్యూటీ లావణ్య త్రిపాఠి. అడవిలోని ఓ మార్గంలో తెల్ల పంజాబీ డ్రస్సులో ఉమాంగ్ గుప్తా అనే కొరియోగ్రాఫర్‌తో కలిసి లావణ్య చేసిన స్టెప్పులు అదరగొడుతున్నాయి. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న లావణ్య.. ”నా మనసును ఫాలో అవ్వాలని నేను నేర్చుకున్నా. ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అయ్యి నా మనసుకు దగ్గరైన ఈ అద్బుతమైన పాటకు డ్యాన్స్‌లు వేశా” అని కామెంట్‌ పెట్టారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పలువురు నెటిజన్లు వావ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ

 దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

Loading...
Unable to load recommendations.
Follow Us