Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Lata Mangeshkar Health Update: ప్రముఖ లెజండరీ గాయకురాలు లతా మంగేష్కర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూడు వారాల నుంచి

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?
Lata Mangeshkar

Updated on: Jan 30, 2022 | 7:10 PM

Lata Mangeshkar Health Update: ప్రముఖ లెజండరీ గాయకురాలు లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూడు వారాల నుంచి ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ఆదివారం మాట్లాడారు. కరోనా (Coronavirus) బారినపడిన లతా మంగేష్కర్‌ కోలుకుంటున్నారని మంత్రి రాజేశ్ తోపే (Rajesh Tope) పేర్కొన్నారు. లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ ప్రతీత్‌ సమ్దానీతో మాట్లాడినట్లు వెల్లడించారు. లతా మంగేష్కర్ క్రమంగా కోలుకుంటున్నారని.. ప్రస్తుతం వెంటిలెటర్‌పై లేరని తెలిపారు. ఆమెకు కేవలం ఆక్సిజన్‌ మాత్రమే అందిస్తున్నారని, చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని తోపే తెలిపారు.

కొవిడ్‌తో పాటు న్యుమోనియా నిర్ధారణ కావడంతో గాయకురాలు లతా మంగేష్కర్ ఈ నెల 8న ముంబైలోని బ్రీచ్‌ క్యాండి ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. అయితే క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో రెండు రోజుల కిత్రమే వెంటిలెటర్‌ సపోర్ట్‌ను తొలగించి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ ప్రతీత్‌ సమ్దానీ పేర్కొన్నారు.

Also Read:

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Viral Video: ఏనుగమ్మా ఏనుగు.. పాలు తాగుతూ ఆటలాడుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో