ఒకే రకమైన మూస పాత్రలు చేయడం తనకు ఇష్టముండదని చెబుతోంది గ్లామర్ క్వీన్ లక్ష్మీరాయ్. తన అందచందాలతో యువతను పిచ్చెక్కించే లక్ష్మీరాయ్ తెలుగు, తమిళ భాషల్లో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నటన గురించి తన మనసులోని మాటలను ప్రస్తావించింది.
కథానాయికగా తన దృష్టిలో గ్లామర్ పాత్రలు, అభినయ ప్రధాన పాత్రలు అనే భేదాలేవి లేవు. పాత్ర ఏదైనా దానికోసం నేను పడే కష్టంలో ఏ విధమైన మార్పు ఉండదు’ అని చెబుతోంది. ‘గ్లామర్ పాత్రల్లో తక్కువ శ్రమ, నటనకు ఆస్కారమున్న పాత్రల్లో ఎక్కువ కష్టం ఉంటుదనేది పూర్తిగా అబద్ధం. సినిమా ఏదైనా నటన విషయంలో ఏ విధమైన తేడా వుండదు. అందాల ప్రదర్శనకో, అభినయ ప్రధాన పాత్రలకో పరిమితవడానికి నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు పాత్రలకు తగినట్లుగా బోల్డ్‌గా నటించాల్సి వస్తుంది. నాయికగా ఏం చేసినా అదంతా నటనలో ఓ భాగం మాత్రమే అని చెప్పుకొచ్చింది. కొంతకాలంగా తెలుగు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ తమిళ, మలయాళ చిత్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది.