Rajinikanth : మరోసారి తెరపైకి రజినీకాంత్ ‘రానా’ సినిమా.. ఎలాగైనా సినిమా తీస్తానంటున్న దర్శకుడు..

|

Jan 29, 2021 | 11:27 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటించిన సూపర్ స్టార్ ఆరోగ్యం సహకరించక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న..

Rajinikanth : మరోసారి తెరపైకి రజినీకాంత్ రానా సినిమా.. ఎలాగైనా సినిమా తీస్తానంటున్న దర్శకుడు..
Follow us on

Rajinikanth  : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటించిన సూపర్ స్టార్ ఆరోగ్యం సహకరించక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమా చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ కు తలైవా బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ తో సినిమా చేయాలని దర్శకుడు కెఎస్ రవికుమార్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. గతంలో రానా అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాను ప్రకటించి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. తాజాగా రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా సినిమా గురించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు.  నేను రానా సినిమాలో కొన్ని  మార్పులు చేశాను. ఆరు నెలల క్రితం కథను కూడా రజిని సార్ కు వినిపించా.. ఖచ్చితంగా మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది. అని తెలిపారు. అన్నాత్తే సినిమా తర్వాత సూపర్ స్టార్ సినిమాపై క్లారిటీ లేదు. దాంతో ఆ సినిమా తర్వాత రవికుమార్ సినిమా ఉండొచ్చని అభిమానులు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘అమ్మకి అమ్మాయికి బైక్‌‌‌‌కి అవినాభావ సంబంధం సంబంధం ఉంది’.. ఆకట్టుకుంటున్న ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ టీజర్