కృష్ణంరాజుకు అస్వస్థత..! ఆస్పత్రిలో చికిత్స..!

| Edited By:

Nov 15, 2019 | 2:48 PM

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణం రాజు(79) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడగా.. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కృష్ణం రాజుకి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. గత కొంతకాలంగా తీవ్రమైన న్యుమోనియాతో  బాధపడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు. రెబల్ స్టార్‌గా కృష్ణం రాజుకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. దాదాపు కృష్ణం […]

కృష్ణంరాజుకు అస్వస్థత..! ఆస్పత్రిలో చికిత్స..!
Follow us on

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణం రాజు(79) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడగా.. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కృష్ణం రాజుకి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. గత కొంతకాలంగా తీవ్రమైన న్యుమోనియాతో  బాధపడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు.

రెబల్ స్టార్‌గా కృష్ణం రాజుకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. దాదాపు కృష్ణం రాజు చేసిన సినిమాలన్నీ యాక్షన్ చిత్రాలే. అలాగే.. సెంటిమెంట్ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన చివరగా.. ‘రుద్రమదేవి’ సినిమాలో నటించారు.