మాస్ మాహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ఫుల్ జోష్‌తో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత మాస్ రాజా మళ్లీ ఓ సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకొని ఫాంలోకి వచ్చాడు. ఇందులో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజ పోలీస్ అధికారిగా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్‌లు విలన్లుగా నటించారు.
తాజాగా మాస్ రాజా ‘క్రాక్’ మూవీని తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ రెండు భాషల్లోకి క్రాక్ డబ్ చేసారని.. ఫిబ్రవరి 5న తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా అటు తెలుగు ఓటీటీలో కూడా ఫ్రిబవరి 6న క్రాక్ విడుదల కాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.
Also Read:
‘Uppena’ Movie Update : అందమైన ప్రేమ కావ్యం నుంచి మరో మధురమైన మెలోడీ రాబోతుంది..