డిసెంబర్ 4న ‘జీ5’లో కాజల్ అగర్వాల్ ‘కోమాలి’ ప్రీమియర్… ప్రేక్షకులను మెప్పించేనా.!

తమిళ హీరో 'జయం' రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' సినిమా డిసెంబర్ 4వ తేదీన 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.

డిసెంబర్ 4న జీ5లో కాజల్ అగర్వాల్ కోమాలి ప్రీమియర్... ప్రేక్షకులను మెప్పించేనా.!

Updated on: Dec 03, 2020 | 8:24 PM

Komali OTT Release: తమిళ హీరో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కోమాలి’ సినిమా డిసెంబర్ 4వ తేదీన ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది. లాక్‌డౌన్‌లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌తో వీక్షకులను జీ5 ఎంతగానో ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే.

పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే ఏం జరుగుతుంది? అప్పటి పరిస్థితులకు హీరో అలవాటు పడ్డాడా.? పదహారేళ్ల క్రితం సమాజంలో ఉన్న కథానాయకుడు చేసే పనులు ఏమిటి? అనేది ఈ సినిమా కథాంశం. ‘కోమాలి’ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ‘జీ 5’ వర్గాలు తెలియజేశాయి.

ఇందులో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంయుక్తా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. ఇక కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిజ్ సంగీతం అందించారు.