దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మూవీ ఎంతటీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్‌తో హీరోతోపాటు ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు స్టార్ డమ్ సంపాధించారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన అన్బు-అరివు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలోని ఫైట్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు వీరిద్దరు. కాగా కేజీఎఫ్ భారీ హిట్ సొంతం చేసుకున్న తర్వాత వీరిద్దరు తెలుగులోనూ టాప్ హీరో సినిమాకు పనిచేయనున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజగా ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ మూవీ తర్వాత దర్శకుడు రమేష్ వర్మతో ఖిలాడి అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే రవితేజ నటించనున్న ఖిలాడి సినిమాకు సంబంధించిన యాక్షన్ పార్ట్ ఫైట్ సన్నివేశాలను అన్బు-అరివు సమక్షంలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్‌లను అనుకున్నప్పటికి కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్‌తో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తే సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ ఆలోచిస్తుందట. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్లో నటిస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.