కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

| Edited By:

May 15, 2020 | 7:59 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. దీంతో చాలా సినిమాల విడుదల తేదీలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: కేజీఎఫ్‌ 2 రిలీజ్‌ ఎప్పుడంటే..!
Follow us on

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. దీంతో చిన్న, పెద్ద అన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్ మాత్రం కేజీఎఫ్‌ 2పై పెద్దగా ప్రభావం చూపబోనట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్టోబర్‌ లోపు థియేటర్లు ప్రారంభం అయితే.. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకే(అక్టోబర్‌ 23) ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.

Watch Live:లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, కేజీఎఫ్‌ 2కు సంబంధించి ఇంక కొంత భాగం మాత్రమే చిత్రీకరణ ఉందని, కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని కేజీఎఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా పాన్‌ ఇండియా సినిమాగా కేజీఎఫ్‌ 2 తెరకెక్కింది. ఈ సినిమా మొదటి భాగం పెద్ద విజయం సాధించడంతో.. రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో విడుదల తేదీల్లో ఎటువంటి మార్పు ఉండబోదని సమాచారం. కాగా యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండెన్, సంజయ్‌ దత్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ కిర్గందూర్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి రవి బన్సూర్ సంగీతం అందిస్తున్నారు.

Watch Live:లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

Read This Story Also: ‘ఆపరేషన్‌ చిరుత’.. వన్యమృగం ఎక్కడికి వెళ్లిందంటే..!