కేసీఆర్ బయోపిక్… ఓన్లీ ఫర్ యూట్యూబ్

|

Apr 04, 2019 | 9:57 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ సినిమాకు నిర్మాత. ఇక ఈ చిత్రం క్రిందటి నెల 29న విడుదల కావాల్సిన ఉంది. కానీ కొందరు ఈ సినిమా విడుదల అవ్వకుండా సమస్యలు రేపుతున్నారని.. డిస్ట్రిబ్యూటర్లని, సినిమా థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమా ఎవరు విడుదల […]

కేసీఆర్ బయోపిక్... ఓన్లీ ఫర్ యూట్యూబ్
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ సినిమాకు నిర్మాత. ఇక ఈ చిత్రం క్రిందటి నెల 29న విడుదల కావాల్సిన ఉంది. కానీ కొందరు ఈ సినిమా విడుదల అవ్వకుండా సమస్యలు రేపుతున్నారని.. డిస్ట్రిబ్యూటర్లని, సినిమా థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమా ఎవరు విడుదల చేయొద్దు అని వార్నింగ్ ఇస్తున్నారని నిర్మాత వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ సినిమా బాగా వచ్చింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. నేను ఈ సినిమాను యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో ఫ్రీగా విడుదల చేస్తున్నానని ప్రకటించారు. యూట్యూబ్ నిర్వాహకులు మా సినిమాను మీ ఛానెల్ లో పెట్టుకోవచ్చు, కాపీ రైట్స్ లాంటి సమస్య ఏమి లేదని తెలిపారు.