Kareena Kapoor Second Baby: కరీనా-సైఫ్ రెండో బేబీ ఫొటో లీక్.. ఎవరు షేర్ చేశారో తెలిస్తే షాకే.. వైరల్

Kareena Kapoor - Saif Ali Khan second child: బాలీవుడ్ అందమైన జంటల్లో బెబో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంట ఒకటి. ఈ జంట ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తుంటుంది. 2012లో

Kareena Kapoor Second Baby: కరీనా-సైఫ్ రెండో బేబీ ఫొటో లీక్.. ఎవరు షేర్ చేశారో తెలిస్తే షాకే.. వైరల్
Kareena Kapoor Second Baby Photo

Updated on: Apr 06, 2021 | 12:30 PM

Kareena Kapoor second child: బాలీవుడ్ అందమైన జంటల్లో బెబో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంట ఒకటి. ఈ జంట ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తుంటుంది. 2012లో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2016లో బెబో కరీనా.. సైఫ్ జంట తల్లీదండ్రులయ్యారు. అయితే వారి గారాల పుత్రుడు పేరు తైమూర్.. సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్‌చల్ చేస్తుంటాడు. తైమూర్ ఫొటో కనిపిస్తే చాలు అభిమానులు తెగ సంబరపడుతుంటారు. ఈ క్రమంలోనే కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీనా తన రెండవ బిడ్డ ముఖాన్ని కవర్ చేస్తూ ఒక పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కరీనా సెకండ్ బేబీని చూడాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో మొదలైంది.

ఈ క్రమంలో తాజాగా కరీనా కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ ఓ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సోమవారం నాడు రణధీర్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు పక్క పక్కనే ఉన్న పిల్లల పిక్‌ను షేర్ చేశారు. వారిలో ఒకరు తైమూర్ కాగా.. మరొకరు బెబో రెండవ సంతానం. అయితే కాసేపటికే రణధీర్ ఆ పోస్ట్‌ను తొలగించారు. దీనిపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు ఆ పిక్‌లో ఉన్నది కరీనా సెకండ్ బేబీనే అనే క్లారిటీకి వచ్చారు. అయితే చిన్న తైమూర్ ఫొటోను ఎందుకు పంచుకున్నారు.. ఎందుకు డిలీట్ చేశారనేది చాలామందికి ప్రశ్నగా మారింది.

కానీ ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ సైఫ్, కరీనా జంట రెండో బేబీ ఫొటో కానీ.. పేరును కానీ వెల్లడించలేదు. అయితే ఈ ఫొటోను చూసి అటు బేబో, సైఫ్ అభిమానులు.. ఇటు తైమూర్ ఫాలోవర్లు తెగ సంబరపడుతున్నారు.

మీరు కూడా ఈ ఫొటోను చూడండి..

Also Read:

నాన్న సినిమా చూడు.. మరణించిన కొడుకు ఫోటోతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తండ్రి

పెళ్లికి ముందే గర్భవతివని ఎందుకు చెప్పలేదు..? ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ వెటరన్‌ బ్యూటీ ఏం చెప్పిందో తెలుసా..!