Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ, రెన్యూవల్ డేట్ ఉండాలా? బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ టాక్ షోల్లో సెలబ్రిటీలు చేసే కామెంట్స్ హాట్ టాపిక్స్‌గా మారిపోతాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఓ షోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షో ఫినాలే ఎపిసోడ్‌లో కాజోల్ పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్

Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ, రెన్యూవల్ డేట్ ఉండాలా? బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
Kajol & Twinkle

Updated on: Nov 13, 2025 | 7:54 AM

బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ టాక్ షోల్లో సెలబ్రిటీలు చేసే కామెంట్స్ హాట్ టాపిక్స్‌గా మారిపోతాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఓ షోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షో ఫినాలే ఎపిసోడ్‌లో కాజోల్ పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఆప్షన్ ఉండాలని సూచించారు. విక్కీ కౌశల్, కృతి సనన్ గెస్ట్‌లుగా వచ్చిన ఈ ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కార్యక్రమం ప్రారంభంలో ‘పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఆప్షన్ ఉండాలా?’ అని హోస్ట్ ట్వింకిల్ ఖన్నా ప్రశ్నించింది. దానికి బదులు విక్కీ, కృతి, ట్వింకిల్‌లు ‘లేదు’ అని ఒకవైపు నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ బాక్స్‌లోకి అడుగుపెట్టింది. ‘ఇది పెళ్లి, వాషింగ్ మెషిన్ కాదు!’ అని ట్వింకిల్ అందరినీ నవ్వించింది.

కానీ కాజోల్ తన ఆలోచనే సరైనదనే వాదించింది. ‘సరైన వ్యక్తిని సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని ఏ గ్యారంటీ ఉంది? రెన్యూవల్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎవరూ ఎక్కువ కాలం బాధపడాల్సి రాదు’ అంటూ చెప్పుకొచ్చింది కాజోల్. ఆ మాటతో ట్వింకిల్ కూడా ఏకీభవించింది.

అంతేకాదు, ‘డబ్బు సంతోషం కొనగలదా?’ అనే ప్రశ్నకు ట్వింకిల్, విక్కీ ‘అవును’ అనగా, కాజోల్ ‘కాదు’ అని, ‘ఎంత డబ్బు ఉన్నా అది సంతోషానికి అడ్డంకి అవుతుంది. నిజమైన సంతోషం ఫీల్ చేయకుండా చేస్తుంది’ అంటూ వివరించింది.

ఇక ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లను మరొకరు డేట్ చేయకూడదా?’ అని అడగ్గా, ట్వింకిల్ ‘బాయ్‌ఫ్రెండ్ కంటే నా ఫ్రెండ్స్ నాకు ముఖ్యం. అలా చేయడం వల్ల ఎక్కడైనా దొరికిపోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. అప్పుడు కాజోల్ వైపు చూసి ‘మనకు ఒక ఎక్స్ కామన్ ఉన్నాడు, కానీ చెప్పలేం’ అని ట్వింకిల్ అనగానే ‘షటప్, ప్లీజ్!’ అని నవ్వులు పూయించింది కాజోల్.

గత ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్‌తో ‘ఎమోషనల్ ఇన్ఫిడెలిటీ vs ఫిజికల్ ఇన్ఫిడెలిటీ’ చర్చలో కూడా ఇలాంటి వివాదాలు వచ్చాయి. కాజోల్, కరణ్ జోహార్, ట్వింకిల్ ఎమోషనల్‌ను ఘోరమనగా, జాన్వీ మాత్రం ఫిజికల్‌ను డీల్ బ్రేకర్‌గా చూసింది. ప్రస్తుతం కాజోల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.