నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మి కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. విజయవంతమైన చిత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరై పోయింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వెటరన్ హీరోలతోనే కాకుండా ఇటు యువతరం హీరోలతో కూడా నటిస్తూ అందరిని మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
కాజల్ అగర్వాల్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగెట్టి భర్త వెనకాలే నడుస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కిచ్డ్ పేరిట హోమ్ డెకార్ బ్రాండ్‌ని స్టార్ట్ చేశారు. దీని గురించి కాజల్ వివరిస్తూ మా ఇద్దరి ప్రేమ నుంచి ఇది పుట్టిందని, ప్రస్తుతం ఫెస్టివ్ థీమ్‌తో చేతితో తయారుచేయబడిన కుషన్స్‌ని మేము తెస్తున్నామని పేర్కొంది. అందరికి నచ్చేలా, ఇంటి అందాన్ని పెంచేలా ఈ ప్రొడక్ట్స్‌ని తీసుకురావడమే మా బ్రాండ్ ప్రధాన ఉద్ధేశ్యమని ప్రకటించింది. మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. లిమిటెడ్ కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయని, వీలైనంత త్వరగా షాపింగ్ చేయండని కోరుతోంది. మా బ్రాండ్ నుంచి వస్తున్న తొలి ప్రొడక్ట్స్‌ని ఎంజాయ్ చేయండని పిలుపునిస్తోంది.