రానాకు దొరికేసిన హీరోయిన్.. అచ్చొచ్చిన భామతో రెండో సినిమా?

| Edited By:

Nov 30, 2019 | 10:31 AM

అనారోగ్య కారణాల వలన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన దగ్గుబాటి వారసుడు రానా.. మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవ్వనున్నాడు. ప్రస్తుతం రానా చేతిలో అరడజన్ సినిమాలు ఉండగా.. వాటన్నింటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రానా నటించబోయే ఓ చిత్రానికి ఇన్నిరోజులు హీరోయిన్‌ ఫైనల్ అవ్వకపోగా.. ఇప్పుడు ఓ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ఏంటా చిత్రం..? ఎవరా హీరోయిన్..? అంటే..! డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ కొరియన్ […]

రానాకు దొరికేసిన హీరోయిన్.. అచ్చొచ్చిన భామతో రెండో సినిమా?
Follow us on

అనారోగ్య కారణాల వలన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన దగ్గుబాటి వారసుడు రానా.. మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవ్వనున్నాడు. ప్రస్తుతం రానా చేతిలో అరడజన్ సినిమాలు ఉండగా.. వాటన్నింటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రానా నటించబోయే ఓ చిత్రానికి ఇన్నిరోజులు హీరోయిన్‌ ఫైనల్ అవ్వకపోగా.. ఇప్పుడు ఓ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ఏంటా చిత్రం..? ఎవరా హీరోయిన్..? అంటే..!

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ కొరియన్ సినిమా రీమేక్‌లో నటించేందుకు రానా ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనుండగా.. రానానే ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఇక ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం నయనతార, కీర్తి సురేష్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆ మధ్యలో వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన వారు ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పగా.. ఇప్పుడు చందమామ కాజల్ ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌కు సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. రానాకు కాజల్ ఓకే చెప్పింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది అని టీమ్ సన్నిహితులు అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలో మొదటిసారిగా కాజల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే రానా, కాజల్ ఇదివరకు ‘నేనే రాజు నేనే మంత్రి’లో కనిపించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించగా.. ఈ జోడీ కెమిస్ట్రీకి విశ్లేషకుల నుంచి మంచి మార్కులు పడ్డ విషయం తెలిసిందే.