`క్వాంటికో` సిరీస్ రీమేక్‌లో కాజల్

Kajal in Famous Web Series : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళంలో కూడా దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగానే ఉంది. త్వరలో వెబ్ సిరీస్ పై కూడా కాజల్ కన్ను పడింది. అక్కడ కూడా తన సత్త చాటబోతోందట. ప్రియాంకా చోప్రాకు  హాలీవుడ్ రేంజ్‌లో గుర్తింపు తీసుకొచ్చిన `క్వాంటికో` సిరీస్ రీమేక్‌లో కాజల్ నటించబోతోందట. […]

`క్వాంటికో` సిరీస్ రీమేక్‌లో కాజల్

Updated on: Jul 24, 2020 | 5:51 AM

Kajal in Famous Web Series : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళంలో కూడా దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగానే ఉంది. త్వరలో వెబ్ సిరీస్ పై కూడా కాజల్ కన్ను పడింది. అక్కడ కూడా తన సత్త చాటబోతోందట.

ప్రియాంకా చోప్రాకు  హాలీవుడ్ రేంజ్‌లో గుర్తింపు తీసుకొచ్చిన `క్వాంటికో` సిరీస్ రీమేక్‌లో కాజల్ నటించబోతోందట. భారత్‌లోని పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ రూపొందనుందట. అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ గుర్తింపు ఉన్న కాజల్‌ను ప్రియాంక పాత్ర కోసం సంప్రందించారట.

`క్వాంటికో` సిరీస్‌లో ప్రియాంక హాట్ హాట్‌గా నటించిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో ఇండియన్ సిరీస్‌ను కూడా రూపొందించేందుకు ‘నెట్‌ఫ్లిక్స్’ సిద్ధమవుతోందట. ఈ సిరీస్‌లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పిందట.

Loading...
Unable to load recommendations.
Follow Us