నెట్టింట్లో ఇప్పుడు కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్ అనే ఓ పల్లీల వ్యాపారి సరదాగా పాడిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్.. ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనమిస్తోంది. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రెటీలు సైతంఈ పాటకు ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు. ఇక ఈ ట్రెండీ సాంగ్‌కు రీక్రియేషన్లు, స్ఫూప్‌లు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా కచా బాదం పాటకు తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. ‘పచ్చి పల్లీ’ పేరుతో విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది.
‘నా పేరు మట్టయ్య. ప్రతిరోజు బీచ్‌లో పల్లీలు అమ్ముతుంటాను. పిజ్జాలు, బర్గర్లకు అలవాటు పడిన జనం నా పల్లీలు కొనడం మానేశారు. నేనింకా ఇక్కడ ఎప్పుడూ పల్లీలు అమ్మకపోవచ్చు. అలాంటి సమయంలో నాకొక ఆలోచన వచ్చింది. అదే పచ్చీ పల్లీల షోరూమ్.. ‘ అంటూ థియేటర్లలో సినిమాకు ముందు వచ్చే ముకేశ్ యాడ్‌ను రీక్రియేట్ చేస్తూ ఈ పాట ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ‘పల్లీ పల్లీ..ఇది పచ్చీ పల్లి’ అంటూ లిరిక్స్ తో సాగుతుంది. కాగా ఈ పాటను సొంతంగా రచించి ఆలపించాడు సూర్య అకొండి అనే యూట్యూబర్. స్ర్కీన్‌ప్లే బాధ్యతలను కూడా అతనే తీసుకున్నాడు. ఇక పాటకు తగ్గ రీతిలో అద్భుతమైన బాణీలు అందించాడు శ్రీకిరణ్ ఉపద్రష్ట. శ్రీ సిల్కీ మాంక్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ పాటకు లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. విద్యాసాగర్ కెమెరామెన్‌గా వ్యవహరించాడు. కాగా కాకినాడకు చెందిన సూర్య గతంలో పలు సినిమాలకు స్పూప్‌లు, రీక్రియేషన్లు తెరకెక్కించాడు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న కచాబాదం తెలుగు పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Also Read:Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!