మెగాస్టార్‌కి జీవితాంతం రుణపడి ఉంటా!.. ఇది నాకు పూర్వజన్మలాంటిది.. అతడి వల్లే పూర్తిగా కోలుకున్నా..

Journalist Rammohan Naidu: మెగాస్టార్ చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు

మెగాస్టార్‌కి జీవితాంతం రుణపడి ఉంటా!.. ఇది నాకు పూర్వజన్మలాంటిది.. అతడి వల్లే పూర్తిగా కోలుకున్నా..

Updated on: Feb 07, 2021 | 8:41 AM

Journalist Rammohan Naidu: మెగాస్టార్ చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు అన్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా 4 నెలలుగా చికిత్స పొందుతున్న రామ్మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే, చిరు స్వయంగా రామ్మోహన్ ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో శనివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్.

తాను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నానని గుర్తు చేశాడు. తన కోసం చిరంజీవి హైదరాబాద్ నుంచి వచ్చారని, తనకు మనోధైర్యం చెప్పారని, నిజంగా ఇది తనకు పునర్జన్మ లాంటిదన్నారు. వైద్యులు, చిరంజీవి వల్లనే తాను పూర్తిగా కోలుకున్నానని, తనకు ఇచ్చిన సపోర్ట్‌కు జన్మంతా చిరుకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు, ఫ్యాన్స్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

సీనియర్ జర్నలిస్టును పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి… నిబద్ధత కలిగిన పాత్రికేయుడని ప్రశంస…