ఇటీవల తెరుచుకున్న థియేటర్లలోకి సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అటు తెలుగు, తమిళంలో ఇప్పటికే పలు సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్లో థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూర్తైన సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సినిమా కూడా ఉంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో కూడా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి సల్మాన్‌కు పోటీగా రాబోతున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం నటిస్తున్న సినిమా “సత్యమేవజయతే 2”. ఈ సినిమా కోసం ఎప్పటినుంచే ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్రయూనిట్ తీపికబురు అందించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాను మే 14న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో జాన్ అబ్రహం తెలుపు కుర్తాపైజామా ధరించి.. తలకు పాగా కట్టుకొని భారత దేశపు జెండా ఎగురవేస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాతోపాటు మరో స్టార్ హీరో సల్మాన్ మూవీ కూడా మే 14న విడుదల కానుంది. సల్మాన్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా మే 14న రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది చిత్రయూనిట్. ఇదిలా ఉండగా.. ఒకే రోజు విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు స్టార్ హీరోల సినిమాలపై ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ ఇద్దరు హీరోలలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించనుందో చూడాల్సిందే.
Also Read:
Master movie : డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైన దళపతి ‘మాస్టర్’.. రిలీజ్ ఎప్పుడంటే..