Jhanvi Kapoor: హార్ట్ టచింగ్ వర్డ్స్.. అర్జున్ కపూర్ తో బంధంపై జాన్వీ ఏమందంటే..

|

Aug 10, 2022 | 9:18 PM

బాలీవుడ్ లో అత్యంత పేరొందిన జాన్వీకపూర్, అర్జున్ కపూర్ ల గురించి ప్రత్యేకమైన పరచయం అవసరం లేదు. అర్జున్, జాన్వీ ఇద్దరూ నిర్మాత బోనీ కపూర్ పిల్లలే.. కాని.. అర్జున్ కపూర్ బోని కపూర్ మొదటి భార్య శౌరి కుమారుడు అయితే.. జాన్వీ బోనీ కపూర్ రెండో భార్య

Jhanvi Kapoor: హార్ట్ టచింగ్ వర్డ్స్.. అర్జున్ కపూర్ తో బంధంపై జాన్వీ ఏమందంటే..
Arjun Kapoor
Follow us on

Jhanvi Kapoor: బాలీవుడ్ లో అత్యంత పేరొందిన జాన్వీకపూర్, అర్జున్ కపూర్ ల గురించి ప్రత్యేకమైన పరచయం అవసరం లేదు. అర్జున్, జాన్వీ ఇద్దరూ నిర్మాత బోనీ కపూర్ పిల్లలే.. కాని.. అర్జున్ కపూర్ బోని కపూర్ మొదటి భార్య శౌరి కుమారుడు అయితే.. జాన్వీ బోనీ కపూర్ రెండో భార్య శ్రీ దేవి కుమార్తే.. గతంలో ఇద్దరి మధ్య సోదర బంధం అంతగా ఉండేది కాదు.. కాని కొంతకాలంగా వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. రెండు రోజుల్లో రక్షా బంధన్ పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ తో బంధంపై హార్ట్ టచింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ.. తన అన్నయ్యకు మొదటిసారి రాఖీ కట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దానిని ఎప్పటికి మర్చిపోలేనని.. ఆసందర్భం ఓ మధురానుభూతి అంటూ చెప్పుకొచ్చారు. నమ్మకం, భద్రత, అవగాహన ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఆదర్శవంతంగా ఉంటుంది. తాను అర్జున్ భయ్యాతో ఇవ్వన్నీ కలిగి ఉన్నానని.. అతడు నా సోదరుడు కావడం నా అదృష్టమంటూ సెంటిమెంటల్ కామెంట్స్ చేసింది జాన్వీ.

అర్జున్ కపూర్ కి మొదటిసారి రాఖీ కట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అదొక ప్రత్యేక క్షణం అంటూ చెప్పింది జాన్వీ కపూర్. అది తన జీవితంలో మర్చిపోలేని రక్షా బంధన్ అని తెలిపింది. బోని కపూర్, శౌరి కపూర్ కుమార్తె అన్షుల్లా కపూర్, అర్జున్ కపూర్ లతో తన బంధం ప్రతి సంవత్సరం మరింత స్ట్రాంగ్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది ఈబాలీవుడ్ నటి. వారిద్దరూ నా బలం అంటూ గుండెను హత్తుకునే మాటలు చెప్పింది. మేమంతా ఒకటే కుటుంబంగా ఉండాలని ఎప్పటికి కోరుకుంటున్నానని తెలిపింది. రక్షా బంధన్ తమకు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎంత బిజీగా ఉన్నప్పటికి.. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడిపే పండుగ, ప్రతి ఏడాది లాగే ఈఏడాది కూడా అదే జరుగుతుంది. రక్షా బంధన్ ను వేడుకగా చేసుకుంటాం.. అంతా ఒకేచోటకు చేరి మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాం.. అంతా కలిసి సరదాగా ఉంటామంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వికపూర్ కు సోదరుడు అర్జున్ కపూర్ నుంచి మద్దతు లభించడంతో ఆమె అర్జున్ తో సోదర బంధాన్ని బలోపేతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు  కోసం చూడండి..