Janhvi Kapoors : లేడీ సూపర్ స్టార్‌ నయనతార క్యారెక్టర్ చేయనున్న జాన్వీ కపూర్.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా..

|

Jan 11, 2021 | 2:24 PM

Janhvi Kapoors : కోలివుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘కొలమావు కోకిల’ హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార అద్భుతంగా

Janhvi Kapoors : లేడీ సూపర్ స్టార్‌ నయనతార క్యారెక్టర్ చేయనున్న జాన్వీ కపూర్.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా..
Follow us on

Janhvi Kapoors : కోలివుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘కొలమావు కోకిల’ హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. తమిళంలో ఈ చిత్రం విజయవంతంగా నిలిచింది. దీంతో గుడ్‌లక్ జెర్రీ టైటిల్‌తో కలర్ ఎల్లో ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆనంద్ ఎల్ రాయ్. అయితే ఇందులో నయనతార పోషించిన క్యారెక్టర్‌కు అందాల నటి శ్రీదేవి కుమార్త జాన్వీకపూర్‌ను ఎంపిక చేశారు. అయితే చిత్ర యూనిట్ జాన్వీకి వెల్ కమ్ చెప్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సింపుల్ పంజాబీ డ్రెస్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తున్న జాన్వీ లుక్‌కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. కాగా పంజాబ్‌లోని పటియాలలో షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాకు సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకులు కాగా పంకజ్ మట్టా రచయిత దీపక్ దోబ్రియాల్, సుశాంత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Chicken Prices: బర్డ్ ప్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పడిపోతున్న చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో చికెన్ ధర ఎంతంటే..