janhvi kapoor: క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన అందాల తార… కోలాహలంగా మారిన షూటింగ్‌ స్పాట్…

Janhvi Kapoor Playing Cricket: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా గుర్తింపు, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌ బోని కపూర్‌ గారాల పట్టిగా మరో అదనపు గుర్తింపు. ఇలా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాను సంపాందిచుకున్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి జాన్వీకపూర్‌...

janhvi kapoor: క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన అందాల తార... కోలాహలంగా మారిన షూటింగ్‌ స్పాట్...

Updated on: Jan 31, 2021 | 3:06 PM

Janhvi Kapoor Playing Cricket: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా గుర్తింపు, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌ బోని కపూర్‌ గారాల పట్టిగా మరో అదనపు గుర్తింపు. ఇలా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాను సంపాందిచుకున్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి జాన్వీకపూర్‌.
తొలిసినిమాలో స్టార్‌ హీరోల సరసన, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో నటించే అవకాశం ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న ‘సైరత్‌’ రీమేక్‌.. ‘ధడక్‌’ సినిమాలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. తొలిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ వంటి హీరోయిన్‌ సెంట్రిక్‌ సినిమాలో నటించింది. ఇక తాజాగా జాన్వీ కపూర్ నటిస్తోన్న ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రం చంఢీఘర్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్‌ స్పాట్‌లో దొరికిన ఖాళీ సమయంలో బ్యాట్‌ చేతపట్టి క్రికెట్‌ ఆడింది జాన్వీ. ఇక జాన్వీ షాట్స్‌ కొడుతుంటే సెట్‌లో ఉన్న వారంతా కేకలు వేశారు. ప్రస్తుతం జాన్వీ క్రికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే జాన్వీ నటిస్తోన్న ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రం.. తమిళంలో నయనతార హీరోయిన్‌గా నటించిన హిట్‌ చిత్రం ‘కోలమావు కోకిల’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు జాన్వీ.. ‘దోస్తానా2’లో కూడా నటిస్తోంది.

Also Read: మళ్లీ ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరోలు.. ఒకే నెలలో థియేటర్లలో పోటీకి సిద్ధం.. అభిమానలకు పండగే ఇక