AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 40 ఏళ్లల్లో ఆమెకు నేను ప్రశాంతత ఇవ్వలేదు.. విడాకులకు కారణం నేనే.. జైలర్ విలన్ ఎమోషనల్….

19 ఏళ్ల వయసులో మొదలైన ప్రేమ బంధం, ఆ తర్వాత 40 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. తన వైవాహిక జీవితం గురించి జైలర్ నటుడు వినాయకన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య బబితతో విడాకులకు తన స్వభావమే కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో, ఆమె వెళ్లిపోవడం వల్ల తన జీవితంలో ఏర్పడిన శూన్యం గురించి, తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన బహిరంగంగా మాట్లాడారు.

Cinema : 40 ఏళ్లల్లో ఆమెకు నేను ప్రశాంతత ఇవ్వలేదు.. విడాకులకు కారణం నేనే..  జైలర్ విలన్ ఎమోషనల్....
Actor Vinayakan
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 9:51 AM

Share

మలయాళ చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటుడు వినాయకన్. జైలర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన వ్యక్తిగత జీవితం , విడాకుల గురించి చాలా సున్నితమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో మహారాజా కాలేజీలో మొదలైన ప్రేమ, 40 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో వినాయకన్ తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఒక ఇంటర్వ్యూలో, తన భార్య బబిత నుండి విడిపోవడానికి గల పూర్తి కారణాన్ని ఆయన వివరించారు. వినాయకన్ ప్రకారం, ఈ విడాకులలో తన భార్య తప్పు ఏమీ లేదు, కేవలం తన స్వభావమే దీనికి కారణం. ఆమె వెళ్లిపోవడంతో, తన మనసు విప్పి మాట్లాడటానికి జీవితంలో ఎవరూ మిగల్లేదని చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. విడాకులు తన భార్య తప్పు వల్ల కాదని, కేవలం తన స్వభావం వల్లే తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. వారి మధ్య ఎలాంటి వాదనలు, గొడవలు లేవని, కలిసి జీవించలేకపోవడం వల్లే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

“నాకు ఒక భార్య ఉండేది, ఇప్పుడు మేము విడిపోయాము. మా మధ్య ఎలాంటి గొడవ లేదు, కేవలం కలిసి జీవించలేకపోవడం వల్లే విడిపోయాము. సాధారణంగా మనం మన మనసులోని మాటలను కనీసం ఒక్కరితోనైనా పంచుకుంటాం, కదా? నాకు ఆమె నా భార్య. నేను ఆమెతో ప్రతిదీ పంచుకునేవాడిని. ఇప్పుడు నా జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరూ మిగల్లేదు. అప్పటినుంచి నా జీవితం చాలా మారిపోయింది,” అని వినాయకన్ ఇంటర్వ్యూలో అన్నారు. “నాకు 19 ఏళ్ల వయసు నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం. మాది ప్రేమ వివాహం. మా బంధం మహారాజా కాలేజీలో మొదలైంది. 40 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత, ఆమె అకస్మాత్తుగా నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి నాకు పనులన్నీ చక్కబెట్టుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా డబ్బు విషయాలు. నా దగ్గర ఆర్థిక లావాదేవీల కోసం ఆన్‌లైన్ యాప్ కూడా లేదు, అన్నీ ఆమెనే చూసుకునేది”

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

నా స్వభావం వల్ల ఆమె నాతో కలిసి జీవించడం కష్టమైంది. అందుకే మేము విడిపోయాము. ఇందులో ఆమె తప్పు లేదు. నేను ఆమెకు మనశ్శాంతిని ఇవ్వలేకపోయాను. నిరంతరం గొడవలు, పోట్లాటల కంటే ఈ ఎడబాటు మా ఇద్దరికీ మంచిదని నేను భావించాను. ఈ రోజుకీ ఆమె నా కోసం చాలా విషయాలు చూసుకుంటుంది. నా యూట్యూబ్‌కు రీఛార్జ్ చేసే పని కూడా ఆమెనే చేస్తుంది” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us