Jabardasth Babu: రూ.5 లక్షలు ఇచ్చి నాకు పెద్ద పరీక్షే పెట్టారు.. వాళ్లు నన్ను అంత ఈజీగా నమ్మలేదు.. డైరెక్టర్ జబర్దస్త్ బాబు..

ఇటీవల లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు జబర్దస్త్ బాబు. ఈ చిత్రానికి ఓటీటీలో సంచలన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు తన దర్శకత్వ ప్రయాణం గురించి వెల్లడించారు. నిర్మాతలు స్క్రిప్ట్‌తో పాటు దర్శకుడి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి 13 నిమిషాల డెమోను చేయించారని తెలిపారు. ప్రేమ వాలంటీర్ వెబ్ సిరీస్‌తో తనకు దర్శకత్వ అనుభవం ఉందని పేర్కొన్నారు.

Jabardasth Babu: రూ.5 లక్షలు ఇచ్చి నాకు పెద్ద పరీక్షే పెట్టారు.. వాళ్లు నన్ను అంత ఈజీగా నమ్మలేదు..  డైరెక్టర్ జబర్దస్త్ బాబు..
Jabardasth Babu

Updated on: Oct 30, 2026 | 4:27 PM

టెలివిజన్ రంగంలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత డిజిటల్ మాధ్యమంలోనూ, దర్శకత్వంలోనూ దూసుకెళ్తున్న జబర్దస్త్ బాబు. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ మూవీకి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా.. తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. బుల్లితెరపై నవ్వులు పంచడమే కాకుండా, తనకంటూ ఓ కొత్త గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతటి కష్టపడాల్సి వచ్చిందో ఆయన తాజాగా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రూపొందించిన ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు తనపై నమ్మకం ఉంచడానికి ముందుగా ఎలాంటి పరీక్ష పెట్టారో ఆయన స్పష్టం చేశారు. సినిమా లేదా వెబ్ సిరీస్ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే దర్శకులను నిర్మాతలు అంత ఈజీగా నమ్మరని జబర్దస్త్ బాబు తెలిపారు. తన విషయంలోనూ అదే జరిగిందని, ముందుగా తన స్క్రిప్ట్ నచ్చినప్పటికీ.. తాను నిజంగానే డైరెక్షన్ చేయగలనా లేదా అని పరీక్షించడానికి నిర్మాతలు ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చు పెట్టించారని ఆయన గుర్తుచేసుకున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందే దాదాపు 13 నిమిషాల పాటు ఒక డెమో సీన్‌ను షూట్ చేయాలని తనకు పెద్ద పరీక్షే పెట్టారని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఒక రోజు పూర్తి సమయం కేటాయించి, ఆర్టిస్టులతో కలిసి మూడు కీలక సన్నివేశాలను షూట్ చేసి వారికి చూపించిన తర్వాతే ప్రొడ్యూసర్లు సంతృప్తి చెందారని బాబు చెప్పారు. నరేంద్ర (ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్), కార్తీక్ (38 21 ఫేమ్) వంటి నటులతో ఆ డెమో షూట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం స్క్రిప్ట్ బాగున్నంత మాత్రాన సరిపోదని, తెరపై దానిని అద్భుతంగా ఆవిష్కరించే ప్రతిభ దర్శకుడికి ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ప్రతి ప్రొడ్యూసర్‌కు ఉండే కామన్ ప్రాసెస్ అని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

గతంలో తాను ప్రేమ వాలంటీర్ అనే ఏడు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించానని, అది యూట్యూబ్‌లో అందుబాటులో ఉందని జబర్దస్త్ బాబు గుర్తు చేశారు. ఈ డెమోలో నరేంద్ర (ప్రీ వెడ్డింగ్ షో), మహేంద్ర, కార్తీక్ (30 వెడ్స్ 21 ఫేమ్) వంటి నటులు పాల్గొన్నారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

జబర్దస్త్ బాబు ఇంటర్వ్యూ…

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us