మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సోషల్ మెసేజ్ తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ రెండేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ తో కలిసి నటించిన శబాష్ నాయుడు సినిమా కూడా ఆగిపోయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కాగా శృతి హాసన్ ప్రస్తుతం పలు హిందీ చిత్రాలు, రియాలిటీ షోస్ చేస్తోంది. చిరంజీవి- కొరటాల శివ సినిమా గురించి ప్రస్తుతానికి అధికారక ప్రకటన ఏది రాలేదు. ఇక చిరంజీవి అయితే ‘సైరా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.