
Is Anupama Parameswaran engaged: అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది నటీమణుల్లో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ.
కెరీర్ తొలినాళ్ల నుంచి గ్లామర్ పాత్రలకు వీలైనంత దూరంగా ఉంటూ వస్తోన్న ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఇక తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోన్న అనుపమ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో అను సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా మారింది. క్రమం తప్పకుండా తన ఫొటోలను పోస్ట్ చేస్తూ వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్లను జోడిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా అనుపమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమె ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. వేలుకి రింగ్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఎంగేజ్‌డ్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో అనుపమకు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? అని అందరు ఆలోచనలో పడ్డారు. అయితే అనుపమ కేవలం తన ఫ్యాన్స్‌ను ఆటపట్టించేందుకే ఇలా చేసినట్లు అర్థమవుతోంది. ఓ చిన్నారి తన వేలు పట్టుకోగా తీసిన ఫొటో కావడంతో కేవలం ఫన్నీగా ఈ పోస్ట్ చేసుంటుందని ఆమె అభిమానులు కామెంట్లు చేశారు. మరి ఈ ఫొటోపై అను ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుపమకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ అమ్మడు ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.