iBomma: ఐబొమ్మ చాప్టర్ ముగిసింది.. ఇక సినిమాలు లేనట్టేనా.! ఇప్పుడెలా..

| Edited By: Anil kumar poka

Nov 14, 2022 | 5:13 PM

ఐ బొమ్మ అనకున్నది అనుకున్నట్టు చేసేసింది. నిర్దాక్షిణ్యంగా తన వెబ్ సైట్‌ను షట్ డౌన్ చేసింది. ఫ్రీ గా.. క్వాలిటీతో..

iBomma: ఐబొమ్మ చాప్టర్ ముగిసింది.. ఇక సినిమాలు లేనట్టేనా.! ఇప్పుడెలా..
Ibomma
Follow us on

ఐ బొమ్మ అనకున్నది అనుకున్నట్టు చేసేసింది. నిర్దాక్షిణ్యంగా తన వెబ్ సైట్‌ను షట్ డౌన్ చేసింది. ఫ్రీ గా.. క్వాలిటీతో అందుతున్న ఎంటర్‌ టైన్మెంట్‌ను కాలరాసింది. తనను ఫాలో అవుతున్న సగటు సినీ అభిమానిని విపరీతంగా హర్ట్ అయ్యేలా చేసింది. ఎస్! ఓటీటీ బాదుడు నుంచి.. క్లాస్ట్లీగా మారిన కంటెంట్ నుంచి అందర్నీ తన వైపుకు మరల్చుకుంది ఐబొమ్మ. అన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న తెలుగు కంటెంట్‌ను ఒకే చోట చేర్చి.. విత్ అవుట్ యాడ్స్ మనకు అందించింది. డౌన్లోడ్ ఆప్షన్ ను కూడా ఎనబుల్ చేసి.. అందర్నీ విపరీతంగా ఇంప్రెస్ చేసింది. క్వాలిటీ మ్యాటర్స్ అనే ట్యాగ్ లైన్‌తో… అంతటా పాపులర్ అయింది.

కాని ఏమైందో ఏమో కాని.. మెల్లిమెల్లిగా తన సర్వీస్‌ను తగ్గించుకుంటూ వచ్చింది. మొదట తమపై వస్తున్న ట్రోల్సే, సైట్‌ షట్‌ డౌన్ చేయాలనే నిర్ణయానికి కారణం అంటూ.. నోట్ ఇచ్చి అందర్నీ షాక్ చేసింది. ఆ తరువాత 30 డేస్ మాత్రమే తన లేటెస్ట్ కంటెంట్ ఉంటుందని జలక్ ఇచ్చింది. ఆ తరువాత డౌన్లోడ్ ఆప్షన్ తీసేసి.. ఐబొమ్మ ఎందుకిలా చేస్తోందనే అనుమానం అందరిలో కలిగించింది. ఇక ఓ ఫైన్ డే.. సెప్టెంబర్ 9 నుంచి సైట్‌ షట్‌ డౌన్ చేస్తున్నాం అని అనౌన్స్ పబ్లిష్ చేసి… తాజాగా దాన్నే నిజంగా చేసేసింది. అందర్నీ డిస్సపాయింట్ చేసింది.