Fighter Movie: ‘సత్యాన్ని కాపాడే కవచం టీవీ9 ‘.. ఆకట్టుకుంటోన్న హృతిక్‌ ఫైటర్‌ ప్రమోషన్‌ వీడియో..

|

Jan 25, 2024 | 3:15 PM

హృతిక్‌ రోషన్‌ అద్భుత నటన. సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వ ప్రతిభ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ముఖ్యంగా దేశభక్తి ఎమోషన్స్‌తో పాటు అడ్వెంచరస్‌ సన్నివేశాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో హృతిక్‌ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఈ సినిమాకు...

Fighter Movie: సత్యాన్ని కాపాడే కవచం టీవీ9 .. ఆకట్టుకుంటోన్న హృతిక్‌ ఫైటర్‌ ప్రమోషన్‌ వీడియో..
Fighter Movie
Follow us on

హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ఫైటర్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. ఇక ఎన్నో అంచనాల నడుమ జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి టాక్‌ను సొంతం చేసుకుందీ మూవీ.

హృతిక్‌ రోషన్‌ అద్భుత నటన. సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వ ప్రతిభ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ముఖ్యంగా దేశభక్తి ఎమోషన్స్‌తో పాటు అడ్వెంచరస్‌ సన్నివేశాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో హృతిక్‌ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఈ సినిమాకు రివ్యూలు కూడా బాగా వస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దేశభక్తి నేపథ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. వాయు సేన ధైర్యసాహసాలను, దేశ రక్షణ కోసం వారు చేసే సాహసాలను కళ్లకు కట్టేలా చూపించారు. కథా నేపథ్యం, సినిమాలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు, హృతిక్‌.. దీపికా నటనలు సినిమాకు పాజిటివ్‌గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫైటర్‌ మూవీ విడుదలకు ముందు నుంచి విజయంపై ధీమాగా ఉంది.

ప్రమోషన్స్‌ విషయంలోనూ కొత్త పుంతలు తొక్కించాయి. ఇందులో భాగంగానే టీవీ9 భారత్‌ వర్ష్‌కు సంబంధించి ప్రత్యేక ప్రమోషన్‌ వీడియోను రూపొందించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న టీవీ9 భారత్‌ వర్ష్‌, ఫైటర్‌ మూవీ యూనిట్ సంయుక్తంగా ఓ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేశారు. ‘దేశ రక్షణ కోసం ఫైటర్‌ ఉన్నారు, సత్యాన్ని రక్షించేందుకు టీవీ9 భారత్‌ వర్ష్‌ ఉంది. టీవీ9 భారత్‌ వర్ష్‌ వార్తలు విశ్వసనీయతకు చిరునామాగా, నిప్షక్షపాతంగా ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఫైటర్ స్టోరీని చూడండి, ఇంకా అత్యంత ఖచ్చితమైన వార్తల కోసం టీవీ9 భారత్‌ వర్షన్‌ను చూడండి’ అంటూ హృత్రిక్‌ చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..