Cinema : 2018లో బాక్సాఫీస్‏కే వణుకుపుట్టించింది.. ప్రతి క్షణం భయంకరమైన సస్పెన్స్.. ఓటీటీలో తగ్గని క్రేజ్..

నిజానికి హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుండెల్లో భయం పుట్టించే సీన్స్, ఆసక్తిని రేకెత్తించే సస్పెన్స్ ఉన్నప్పటికీ ఈ జానర్ చిత్రాలను చూసేందుకు జనాలు ముందు ఉంటారు. ప్రస్తుతం ఓ హరర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రతీ సీన్ ఉత్కంఠను రేపుతుంది.. 2018లో ఆ సినిమా బాక్సాఫీస్ కే వణుకుపుట్టించింది.

Cinema : 2018లో బాక్సాఫీస్‏కే వణుకుపుట్టించింది.. ప్రతి క్షణం భయంకరమైన సస్పెన్స్.. ఓటీటీలో తగ్గని క్రేజ్..
Tumbbad

Updated on: Jun 28, 2026 | 7:07 AM

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి క్షణం ఊపిరి బిగబట్టే సస్పెన్స్, భయాన్ని కలిగించే సీన్స్.. ఆద్యంతం ఉత్కంఠను రేపేలా సాగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో హారర్ సినిమాల్లో కామెడీ ప్రధాన హైలెట్ అవుతుంది. అందుకే ఈ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఒంటరిగా చూడాలంటే భయం ఉన్నప్పటికీ ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. బంగారం కోసం తన వారసుడి దురాశ వల్ల కలిగే నష్టాన్ని ఈ చిత్రంలో చూపించారు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు తుంబాద్. దురాశ ఎంతటి అనర్థానికి దారితీస్తుంది అనేది ఈ సినిమాలో తెలుస్తోంది. ఈ మూవీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. కల్పిత కథకు మంచి హారర్ మెటిరీయల్ జోడించి ఈ చిత్రాన్ని అదరగొట్టారు.

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

తుంబాద్.. హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. 2018లో విడుదలైన ఈ సినిమా అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వినాయక్ రావుగా సోహమ్ షా ప్రధాన పాత్ర పోషించారు. 20వ శతాబ్దంలో భారతదేశంలోని మహారాష్ట్రలోని తుంబాద్ గ్రామంలో జరిగిన నిధి వేటను చూపిస్తుంది. దాదాపు 104 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను దాదాపు 5 కోట్లతో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.13 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా విడుదలై ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ సినిమాను మొత్తం నాలుగు వర్షకాలాలపాటు తెరకెక్కించారు. ఇందులోని నిరంతర అడుగుల చప్పుడు, బురద , భయానక ప్రదేశాలు ఈ చిత్రానికి గుర్తింపుగా నిలిచాయి. అందుకే, అదే భయాన్ని, అదే వాస్తవికతను సీక్వెల్‌లో తిరిగి తీసుకురావడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నాలుగు వేర్వేరు వర్షాకాలాలలో షూటింగ్ జరిగింది. ఇప్పుడు నిర్మాతలు ‘తుంబాడ్ 2’ సీక్వెల్ కోసం వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘తుంబాడ్ 2’ చిత్రాన్ని నటుడు-నిర్మాత సోహమ్ షా నిర్మిస్తుండగా, ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2027 డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us