Tollywood : ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. ఇప్పుడు అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్..

సాధారణంగా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోస్ చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు కొందరు తారలు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు. ఒకప్పుడు అతడు అమ్మాయిల కలల రాకుమారుడు. ఇప్పుడేమో దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్.

Tollywood : ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. ఇప్పుడు అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్..
Prashanth

Updated on: Feb 23, 2026 | 6:08 PM

ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరో. 90’s అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో వరుసగా ఒక్కో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. స్టార్ నటుడి వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లల్లోనే ప్రేమకథ చిత్రాలు, రొమాంటిక్ సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. 17 ఏళ్ల వయసులోనే దర్శక దిగ్గజాలు మణిరత్నం, శంకర్ వంటి దర్శకుల సినిమాల్లో హీరోగా నటించారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైన ఆయన.. ఆ తర్వాత కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడిగా దూసుకుపోతున్నారు. అయితే హీరోగా సత్తా చాటుతున్న సమయంలోనే పర్సనల్ విషయాలతో మానసిక ఒత్తిడికి గురయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

భార్యతో విడాకులు తీసుకోవడంతో మానసిక సంఘర్షణకు గురై.. చాలా రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఆయన.. ఇప్పుడు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్ గా ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. హీరో ప్రశాంత్. జీన్స్ సినిమాతో తమిళం, తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం చెన్నైలోని పానగల్ పార్క్ లో ఆయన రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ విశాలమైన జ్యూయెలరీ మాల్ కట్టించారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

దాదాపు 10 అంతస్తులతో సుమారు రూ.1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ బిల్డింగ్ నిర్మించారు. ఇందులో దేశంలోని బ్రాండెడ్ నగలు ఉన్నాయి. అలాగే అందులో ఫుడ్ కోర్ట్స్, ఏటీఎమ్స్ సైతం ఉండడం గమనార్హం. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో హీరో సోదరుడిగా కనిపించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us