Tuck Jagadish : డబ్బింగ్ పనులు ప్రారంభించిన నాని.. త్వరలో ‘టక్‌ జగదీష్’గా రానున్న నేచురల్ స్టార్

యంగ్ హీరో నాని వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. గత ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. కానీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Tuck Jagadish : డబ్బింగ్ పనులు ప్రారంభించిన నాని.. త్వరలో టక్‌ జగదీష్గా రానున్న నేచురల్ స్టార్

Updated on: Jan 05, 2021 | 7:14 AM

Tuck Jagadish : యంగ్ హీరో నాని వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. గత ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత నాని తనకు ‘నిన్నుకోరి’వంటి మంచి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ తో కలిసి ‘టక్ జగదీశ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ‘టక్ జగదీశ్’కు డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు నాని.

టక్‌ జగదీష్‌ డబ్బింగ్‌ కార్యక్రమాలు సోమవారం ప్రారంభించాడు నాని. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను  సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతర్వాత టాక్సీవాలా సినిమాను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ తో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరలో మొదలు పెట్టనున్నాడు ఈ యంగ్ హీరో.

also read : Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ నటి బయోపిక్‌లో తప్పకుండా నటిస్తా: టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న