‘ ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ, అనఘా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుణ 369’. కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ లో హీరో కార్తికేయ లుక్, హీరోయిన్ అనఘా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా ఇటీవల రిలీజైన ‘హిప్పీ’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న కార్తికేయ. ఈ మూవీతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.