నిజమైన శర్వానంద్ భయం.. ఆ సినిమాపైనే ఆశలు..!

| Edited By: Pardhasaradhi Peri

Feb 11, 2020 | 7:45 PM

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు యువ హీరో శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ డైరక్టర్ల హీరోగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు.. ఈ మధ్యన కాస్త వెనకబడ్డారు. 2017లో మహానుభావుడుతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శర్వా.. ఆ తరువాత పడి పడి లేచే మనసు, రణరంగంతో వరుసగా రెండు ఫ్లాప్‌లను చవిచూశారు. ఇక గత వారం జానుతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు ఈ హీరో. తమిళంలో […]

నిజమైన శర్వానంద్ భయం.. ఆ సినిమాపైనే ఆశలు..!
Follow us on

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు యువ హీరో శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ డైరక్టర్ల హీరోగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు.. ఈ మధ్యన కాస్త వెనకబడ్డారు. 2017లో మహానుభావుడుతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శర్వా.. ఆ తరువాత పడి పడి లేచే మనసు, రణరంగంతో వరుసగా రెండు ఫ్లాప్‌లను చవిచూశారు. ఇక గత వారం జానుతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు ఈ హీరో. తమిళంలో ఘన విజయం సాధించిన 96 రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా.. తెలుగులో ఈ మూవీకి మంచి రివ్యూలే వచ్చాయి.

కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం సత్తా చూపించలేకపోతోంది. ఇప్పటికే చాలామంది 96 సినిమాను చూసేయడంతో జానుపై ఆసక్తిని చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు నుంచి ఈ మూవీకి కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇక వారాంతంలోనూ పరిస్థితి అలానే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ వారం తరువాత జానును థియేటర్ల నుంచి తీసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ మూవీతో ఇప్పుడు శర్వా ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ పడింది. దీంతో శర్వానంద్‌ భయం నిజమైందంటున్నారు కొందరు. 96రీమేక్‌ను ఒప్పుకునే సమయంలో శర్వా చాలా ఆలోచించారట. మాతృకను చూసేసిన వారు అందులో విజయ్ సేతుపతి పాత్రతో తనను పోలుస్తారని ముందే ఊహించాడట శర్వా. అందుకే ఈ రీమేక్‌లో నటించలేనని చెప్పేశారట. అయితే దిల్ రాజు తనను నమ్మాలంటూ చెప్పడంతో ఒప్పుకున్నాడట. ఇక ఈ మూవీ విడుదల తరువాత ఆయన భయం నిజమవ్వడంతో.. శర్వా కాస్త ఢీలా పడ్డారట. కాగా ప్రస్తుతం శర్వానంద్, కొత్త దర్శకుడు కిశోర్ దర్శకత్వంలో శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నారు. వ్యవసాయం ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ తన కెరీర్‌లో కచ్చితంగా గుర్తుండిపోతుందని అతడు భావిస్తున్నారు. మరి శ్రీకారం అయినా శర్వాను ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కిస్తుందేమో చూడాలి.