గబ్బర్ సింగ్‌కి కొంచెం తిక్కుంటుంది.. కానీ వీరిద్దరి సినిమాకి ఓ లెక్కుంటుంది.. గ్రేట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే వేళ!

|

Feb 07, 2021 | 10:31 AM

Harish Shankar: టాలీవుడ్‌లో మరో గ్రేట్ కాంబినేషన్ రిపీట్ కానుందా.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్,

గబ్బర్ సింగ్‌కి కొంచెం తిక్కుంటుంది.. కానీ వీరిద్దరి సినిమాకి ఓ లెక్కుంటుంది.. గ్రేట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే వేళ!
Follow us on

Harish Shankar: టాలీవుడ్‌లో మరో గ్రేట్ కాంబినేషన్ రిపీట్ కానుందా.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. ఈ సినిమా ఓ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ప్రక‌టించింది.

అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో హ‌రీష్ శంక‌ర్‌ని చాలా మంది ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంద‌ని చాలా మంది అడుగుతున్నార‌ట. ప‌వ‌ర్ స్టార్ సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వమ‌ని చాలా మంది అడుగుతున్నారు. అప్‌డేట్ కాదు అప్ టూ డేట్ అన్ని స‌క్రమంగా జ‌రుగుతున్నాయి. టైం వ‌చ్చిన‌ప్పుడు ఆ సినిమా గురించి త‌ప్పక చెబుతాను అని హ‌రీష్ శంక‌ర్ ఉప్పెన వేదిక‌గా మాట్లాడాడు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు స‌మాచారం. ప్రస్తుతం ప‌వన్ క‌ల్యాణ్ .. క్రిష్ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయ్యాక ఈ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి గ్రేట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే మరో బంపర్ హిట్ పడ్డట్టే లెక్కని ప్యాన్స్ సంబరపడిపోతున్నారు.

వేరే లెవల్ : మాస్టర్ ప్లాన్ వేసిన హరీష్‌శంకర్, అభిమానులకు పూనకాలేనట !