AA20: ‘పుష్ప’గా బన్నీ.. బర్త్‌డే కానుక అదిరిపోయిందబ్బా..!

| Edited By:

Apr 08, 2020 | 10:23 AM

ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. క్రేజీ కాంబినేషన్ అయిన సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న AA20 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను వచ్చేశాయి.

AA20: పుష్పగా బన్నీ.. బర్త్‌డే కానుక అదిరిపోయిందబ్బా..!
Follow us on

ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. క్రేజీ కాంబినేషన్ అయిన సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న AA20 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను వచ్చేశాయి. పుష్ప అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుండగా.. ఇందులో రఫ్‌ లుక్‌లో బన్నీ అదరగొట్టేస్తున్నారు. మొత్తానికి ముందు చెప్పినట్లుగానే బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చేసింది మూవీ యూనిట్.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. దానికి తగ్గట్లుగా టైటిల్ ఎర్ర చందనం రంగులో ఉంది. అంతేకాదు చెట్టును నరికిన తరువాత దానిపై ఉండే గుర్తులను తెలిపేవిధంగా టైటిల్ డిజైన్ చేయించి.. మరోసారి తన టాలెంట్ బయటపెట్టేశారు సుకుమారు. ఇక ఈ  మూవీలో చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ ‘పుష్ఫ రాజ్’ పాత్రలో బన్నీ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన రాయలసీమ యాసను కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక బన్నీ సరసన రష్మిక తొలిసారి జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముట్టంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ గా తెరకెక్కబోతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Read This Story Also: చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..