స్టార్ హీరోకి విలన్‏గా మారిన దర్శకుడు గౌతమ్.. ఆ సినిమాలో నెగటివ్ రోల్‍లో నటించనున్న గౌతమ్ ?

|

Jan 28, 2021 | 7:06 AM

తమిళ స్టార్ హీరో శింబు, డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన 'విన్నై థాండి వరువాయ', 'అచ్చం ఎన్బాదు మేడమైదా' లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్

స్టార్ హీరోకి విలన్‏గా మారిన దర్శకుడు గౌతమ్.. ఆ సినిమాలో నెగటివ్ రోల్‍లో నటించనున్న గౌతమ్ ?
Follow us on

తమిళ స్టార్ హీరో శింబు, డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన ‘విన్నై థాండి వరువాయ’, ‘అచ్చం ఎన్బాదు మేడమైదా’ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. ఇటీవల డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటుడిగా మారి.. వెబ్ సిరీస్, కొన్ని సినిమాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు. తాజాగా గౌతమ్ విలన్‏గా మారబోతున్నట్టు సమాచారం.

తమిళ స్టార్ హీరో శింబు నటించనున్న సినిమాలో గౌతమ్ విలన్‏గా నటించనున్నారట. ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘పతు తల’ అనే టైటిల్‏ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో శింబు గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనుండగా.. అతనికి ప్రత్యర్థిగా గౌతమ్ మీనన్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో గౌతమ్ మీనన్ దగ్గర ఎన్.కృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేశారు. ఇప్పుడు తను నిర్మిస్తున్న సినిమాలో తన గురువునే విలన్ తీసుకోవడం విశేషం. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

Also Read:

స్టార్ హీరోలను లైన్లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఈసారి మరో టాప్ హీరోతో భారీ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ ?